అదే నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో వివరణాత్మక నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
ఈ పోస్టుల్లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇక శ్రామిక్ పోస్టులకైతే నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ తదితర ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి TGSRTC అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించి, ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలని నియామక బోర్డు సూచించింది.
]]>రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టినట్లు చెబుతున్నారు పోలీసులు. కారు నెంబర్ AP 40HG 0758 నెల్లూరుకి చెందిన తాళ్లూరు రాధ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు చెబుతున్నారు. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
మృతులు తాళ్లూరు రాధ (38), తాళ్లూరు శ్రీనివాసులు (40), సారమ్మ ( 40), వెంగయ్య ( 45), లక్ష్మి (30), డ్రైవర్ గా తెలిపారు. ఈ ప్రమాదంలో చిన్నారి కూడా మరణించింది. కారును స్పీడుగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో.. కారు నుజ్జునుజ్జు అయింది.
కాగా.. సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పెరమన వద్ద టిప్పర్- కారు ఢీకొని ఏడు మంది మృతి చెందడం అత్యంత బాధాకరం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ ఘటనతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది..
]]>రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ దాదాపు ముగిసిన దశలో హైకోర్టులో కొందరు పిటీషన్లు వేశారు. పోస్టుల ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాలంటూ పిటీషనర్లు ఇందులో కోరారు. వీటిని తాజాగా విచారించిన కోర్టు దరఖాస్తు దాఖలు సమయంలోనే అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యం (ప్రిఫరెన్స్) ఐచ్ఛికాన్ని కోరడం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టుల భర్తీ విషయంలో మెరిట్ లిస్ట్ తయారీ అనంతరం అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోవాలని తెలిపింది. అలా కాకుండా దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఐచ్చికాలను పరిగణనలోకి తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలూ విని 4 వారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా మొత్తం 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా 3,36,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో అన్నిరకాల పోస్టులకు కలిపి 15,941 మంది ఎంపికయ్యారు. ఇందులో 7,955 మంది మహిళలు ఉన్నారు. అయితే కొందరు రెండు, మూడు పోస్టులకు ఎంపికవగా.. వారి ప్రాధాన్యాలను విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోకుండా దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఐచ్చికాలనే తుది నిర్ణయంగా భావించి, ఆ మేరకు పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో అభ్యర్ధులు తాము నష్టపోతున్నట్లు పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ- కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ కనకారావు ఓ ప్రకటనలో కోరారు. 10వ, 8వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబరు 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత పత్రాలతో సెప్టెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఆయా ఐటీఐ కాలేజీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐల్లో సెప్టెంబర్ 29న, ప్రైవేటు ఐటీఐల్లో సెప్టెంబర్ 30న కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. ఇతర వివరాలకు 0866-2475575, 94906 39639, 77804 29468 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుముతో బుధవారం (సెప్టెంబర్ 17) వరకు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేవారికి మాత్రం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఇప్పటికే పలు దఫాలుగా ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు పొడిగిస్తూ వచ్చింది. ఈ రోజుతో తుది గడువు ముగియ నుంది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉండబోదని బోర్డు తేల్చి చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఎంపీసీ విద్యార్థులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి అన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభవనున్నట్లు ప్రవేశాల కమి టీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తవగా సెప్టెంబర్ 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇక సెప్టెంబర్ 23న ఆప్షన్లు ఫ్రీజ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 25న సీట్లు కేటాయిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్ 1 నియామక ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. గ్రూప్ 1 అంశంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తూ సెప్టెంబర్ 9న సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు సందర్భంగా టీజీపీఎస్సీకి కోర్టు 2 ఆప్షన్లను ఇచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. లేదంటే 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి, ఆ పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఈక్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేయాలని, చేయవద్దని కోరుతూ దాఖలైన మొత్తం 12 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం 222 పేజీల తీర్పును వెలువరించింది. టీజీపీఎస్సీ పక్షపాతంతో వ్యవహరించి ఉద్యోగ నియామక నియమాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించినట్లు కోర్టు తేల్చింది. ఈ కారణాల వల్ల గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మేరకు మాడరేషన్ పద్ధతిని వర్తింపజేయడం ద్వారా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. పునఃమూల్యాంకనం చేయలేని పక్షంలో 8 నెలల్లోపు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని పేర్కొంది.
నిజానికి.. నిబంధనల ప్రకారం మూల్యాంకనానికి రెగ్యులర్ సిబ్బందినే వినియోగించాల్సి ఉండగా, రిటైర్డ్ అయిన వాళ్లతో చేయించడాన్ని హైకోర్టు నిలదీసింది. నిబంధనల ప్రకారం 2 సార్లు పేపర్లు మూల్యాంకనం చేయాలి. కానీ అలా చేయకుండా మెయిన్స్ పరీక్షలకు కీ, ఆధారాలు చూపలేమని కమిషన్ విడ్డూరంగా సమాధానం చెప్పింది. పైగా రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన పలువురికి ఒకేరకమైన మార్కులు రావడంపై కూడా కోర్టు తప్పుబట్టింది. మహిళా అభ్యర్థులను 28 కేంద్రాలు కేటాయించగా.. ఒక్క కోఠి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లలో మాత్రమే 71 మంది ఎంపికవడం కొసమెరుపు. మిగిలిన 26 పరీక్షా కేంద్రాలో కేవలం 139 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇర ఇంగ్లిష్ మీడియంలో 12,381 మంది పరీక్ష రాయగా వారిలో 506 మంది ఎంపికయ్యారు. తెలుగు మీడియంలో 8,694 మంది రాస్తే.. కేవలం 56 మందే ఎంపికవడం. ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికవడంపై కూడా ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఈ కారణాల వల్ల గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చేపట్టిన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు కోర్టు తేల్చింది. అయితే కమిషన్ మాత్రం తన చర్యను సమర్దించుకుంటూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడం గమనార్హం.
బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
]]>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 21 డ్రాట్స్‌మెన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, హర్టీకల్చర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్ (లైబ్రరీ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సెప్టెంబర్ 18, 2025 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, బీటెక్ (సివిల్), బీఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 8, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.120 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు డ్రాట్స్‌మెన్ పోస్టులకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు, హర్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు, జూనియర్ లెక్చరర్ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
]]>సాధారణంగా అందరి ఇళ్లలో బొద్దింకల బెడద వేదిస్తూ ఉంటుంది. కొందరి ఇళ్లలో బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. నైట్ లైట్స్ ఆఫ్ చేయగానే బొద్దింకల స్వైర విహారం మొదలవుతుంది. కానీ, వీటిని లైట్ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైతే ఇంటిల్లి పాది రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బొద్దింకలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే, ఇంట్లోంచి బొద్దింకలను ఎలా తరిమి కొట్టాలో తెలియక చాలా మంది అవస్థలు పడుతుంటారు. సులభంగా బొద్దింకల నుంచి విముక్తి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బొద్దింకల నుంచి విముక్తి పొందడానికి ప్రతిరోజు ఇంట్లో బోరాక్స్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార మూడింటిని బకెట్ నీళ్లలో కలిపి పిచికారి చేయండి. వారంలో ఇలా నాలుగు రోజులపాటు పిచికారి చేస్తే, బొద్దింకల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. ఇది పిచికారి చేయడం వల్ల కూడా దోమలు రాకుండా ఉంటాయి. అలాగే బల్లులు కూడా తగ్గుతాయి.
బొద్దింకలను తరిమికొట్టడానికి బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. బిర్యానీ ఆకుల వాసన వల్ల బొద్దింకలు పారిపోతాయి. ఇందుకోసం కొన్ని ఆకులను తీసుకొని నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు, బొద్దింకలు ఎక్కడ కనిపించినా ఈ నీటిని చల్లుకోవాలి.. దీనివల్ల అవి పారిపోతాయి.
హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రకటన కింద మొత్తం 160 టెక్నికల్ ఆఫీసర్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో (ECE/ ETC/ E&I/ Electronics/ EEE/ Electrical/ CSE/IT/ Mechanical) బీఈ/బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్/ రిపైర్/ మెయింటెనెన్స్/ మార్కెటింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంట్రోల్స్ ఎక్విప్‌మెంట్/ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్/ ఆపరేషన్స్ ఆప్ ఈవీఎమ్స్ అండ్ VVPATలో ఏడాది పాటు పని అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 ఏళ్లు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలాంటి రాత పరీక్షలేకుండా విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.28,000, మూడు, నాలుగో ఏడాది రూ.31,000 చొప్పున జీతం చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
]]>తెలంగాణలోని యువ కళాకారులకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు), తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు.
1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.
2. వీడియో 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
4.మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
5.బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి
నిర్దేశిత గడువులోగా వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపికలు పూర్తి చేస్తుంది.
ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.com కు పంపగలరు (లేదా) వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపాలి. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు సెప్టెంబరు 30, 2025గా నిర్ణయించారు.
పోటీలో పాల్గొనేందుకు యువ సృజనశీలురకు ఆహ్వానం – -దిల్ రాజు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్
ప్రజా పాలన, తెలంగాణ పండుగలు, చరిత్ర, సంస్కృతి నేపథ్యంగా పోటీలు
]]>